Gossipsబిత్తిరి సత్తి మీద దాడికి పవన్ కి సంబందం ఏంటి..?

బిత్తిరి సత్తి మీద దాడికి పవన్ కి సంబందం ఏంటి..?

v6 లో ప్రచారమయ్యే తీన్మార్ వార్తలకు ఎంతో క్రేజ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఎంతో పాపులర్ అయ్యింది. దీనికి ముఖ్య కారణం బిత్తిరి సత్తి అని అందరికి తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం బిత్తిరి సత్తి మీద ఆ ఛానెల్ పరిసరాల్లోనే దాడి జరిగింది. ఈ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.
 అయితే బిత్తిరి సత్తి చేతులు అడ్డుపెట్టుకోవడంతో పెద్దగా దెబ్బలు తగలలేదు. అయితే తెలంగాణా భాషను కించ పరుస్తున్న కారణం చేతనే అతను బిత్తిరి సత్తిపై దాడి చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే ఇందులో ఓ కొత్త ట్విస్ట్ బయటపడింది. ఈ వ్యవహారంలో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చింది.
దాడి చేసిన వ్యక్తి పవన్ అభిమానిగా భావిస్తున్నారు. అయితే బిత్తిరి సత్తి వ్యవహారం లో పవన్ ఏమైనా స్పందిస్తాడా ..? ఒక వేళ ఇతను నిజంగా ఇతను పవన్ అభిమాని అయితే పవర్ స్టార్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే  తెలంగాణా మీద ప్రేమతో ఆ భాషని కించ పరుస్తున్నాడనే కారణం చేతనే రవి అలియాస్ బిత్తిరి సత్తి మీద దాడి చేసినట్టు మణికంఠ చెప్పుకొస్తున్నాడు.
 తీన్మార్ వార్తల్లో పవన్.. జనసేన పట్ల ఏమైనా వ్యతిరేక వార్తలు చెప్పారా అంటే అలాంటిది ఏమి జరుగలేదు. మరి మణికంఠ పవన్ పేరు ఎందుకు వాడాడు అనే సందేహాలు సర్వత్రా కలుగుతున్నాయి. ఏది ఏమైనా పోలీసుల విచారణలో నిజా నిజాలు తెలుస్తాయి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news