Gossipsపవన్ కోసం రకూల్ అంత ఆరాటపడుతోందా ..?

పవన్ కోసం రకూల్ అంత ఆరాటపడుతోందా ..?

టాలీవుడ్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తూ మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ గ్లామర్ గాళ్ ఇప్పటికే అందరు అగ్రహీరోల పక్కన మెరిసి ప్రేక్షకుల ఆదరణ పొందింది. మాంచి ఫాన్స్ ఫాలోయింగ్ సొంతం

చేసుకుంది అయితే ఒక  టాప్ హీరో పక్కన నటించాలని ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాటపడిపోతోంది.

ఖాకీ సినిమా  రిలీజ్ సందర్భంగా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు వెర్షన్ కోసం తెగ ప్రమోషన్స్ చేస్తోంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించాలని ఉందని గతంలో అనేకసార్లు  తన మనసులోని మాటను చెప్పిన  రకుల్ కోరిక నెరవేరుతుందనే అంతా అనుకున్నా , అసలు ఆ వైపుగా ఏలాంటి వార్తలు వినిపించటం లేదు. కనీస క్లారిటీ కూడా లేదు. రకుల్ కూడా ఇక ఆ ఆఫర్ మీద ఆశలు వదిలేసుకున్నట్టే ఉంది.

అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. నేనూ ఎదురుచూస్తున్నా

ఓ పని చేయండి “నాకూ చేయాలనే ఉంది. ఓ పని చేయండి. మీరే వెళ్లి ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారినే అడగండి”అనేసింది రకుల్ ప్రీత్ సింగ్. పవన్ నే ఈ విషయం అడగమని చెప్పడం చూస్తే రకుల్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తర్వాత రెండు సినిమాల్ని చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి ఆర్టీ నీసన్ తో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన సంతోష్ శ్రీనివాస్ పవన్ సరసన హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారట. రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రాజెక్టులోకి తీసుకునే యోచనలో ఉన్నారని టాక్ వచ్చింది. అయితే ఈ పంజాబీ జిమ్ బేబీ కోరిక నెరవేరుతుందో లేదో చూడలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news