Gossipsఅన్న పేరే కొడుక్కి పెట్టనున్న పవన్ ..?

అన్న పేరే కొడుక్కి పెట్టనున్న పవన్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్యనే మళ్లీ తండ్రైన సంగతి తెలిసిందే. తనయుడు పుట్టిన సందర్భంలో దిగిన పవన్ ఫోటో అప్పట్లో వైరల్ అయ్యింది. అప్పుడే పవన్ కొడుకు పేరు ఏం పెడతాడు అన్న విధంగా చర్చలు నడిచాయి. ఇక ప్రస్తుతం పవన్ తనయుడి పేరు ఇదే అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ పేరు ఏంటి అంటే మార్క్ శంకర్ పవనోవిచ్ అని పవన్ కొడుకు పేరు పెట్టాడట.
ఇది నిజంగా పవన్ పెట్టిన పేరేనా లేక మీడియా సృష్ఠ్యా అన్నద్ది తెలియదు కాని ఈ టైటిల్ పై పవన్ ఇంప్రెషన్ కనిపిస్తుంది. కమ్యునిజం భావలు గల కార్ల్ మార్క్స్ పేరులో మార్క్స్ ను మార్క్ గా పెట్టి అన్న శివ శంకర వర ప్రసాద్ లోని శంకరాని తీసుకుని చివరగా తన పేరు వచ్చేలా చేసుకున్నాడని అంటున్నారు. మరి వినిపిస్తున్న పవన్ తనయుడు మార్క్ శంకర పవనోవిచ్ పేరు నిజమో కాదో తెలియదు కాని ఈ పేరు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఇప్పటికే పవన్ రేణు దేశాయ్ లకు పుట్టిన తనయుడు అఖిరా నందన్ అనే పేరు పెట్టారు. మరి ఈ కొడుక్కి ఏ పేరు ఫైనల్ అవుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news