Gossipsపవన్, రవితేజ మల్టిస్టార్రర్..!

పవన్, రవితేజ మల్టిస్టార్రర్..!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవి తేజ 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ” రాజా ది గ్రేట్ ” . ఈ చిత్రం దీపావళి సందర్భంగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతుంది. అంధుడిగా రవితేజ పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్లలో.

అయితే ప్రదీప్ మాచిరాజు  ‘KTC’ షో కి గెస్ట్ గా విచ్చేసిన రవి తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. రవి తేజ తానూ మెగా స్టార్ ఫ్యాన్ అని మరో సారి గుర్తుచేశారు ప్రేక్షకులకి ఈ షో లో. శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవి స్టైల్ లో నడిచి చూపించారు. షో మొత్తం చాలా సరదాగా సాగింది. మీరు మల్టీ స్టారర్ చేస్తే ఏ హీరో తో చేస్తారు అని ప్రేదీప్ అడిగిన ప్రశ్నకు’  ప్రతి హీరోతో చేయడానికి నేను రెడీ అంటూ సమాధానం ఇచ్చారు రవితేజ.అలా కాకుండా వెంటనే చేయాలని మీరు కోరుకునే హీరో ఎవరు అని అడగగానే, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు. రవితేజ సమాధానం తర్వాత రెండు నిమిషాలు క్లాప్స్ మోగుతూనే ఉండటం విశేషం.

అతి త్వరలో పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వుబోతున్నారన్న విషయం అందరికి తెలిసిందే. అయితే రవితేజ పవన్ తో కలిసి సినిమా చెయ్యాలన్న కోరిక ఎలా తీరుతిందో చూడాలి మరి..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news