Gossipsఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కలయిక అందుకేనా..!

ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కలయిక అందుకేనా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పోటీ అనేది ఎప్పటినుంచో వుంది. ఇప్పటి వరకు మనం మూడు జెనరేషన్స్ లో హీరోల మధ్య పోటీని చూసాం, చూస్తూనే వున్నాం. అయితే ఈ పోటీ అనేది రెండో జెనరేషనలో లిమిట్స్ని క్రాస్ కూడా చేసేసి అది మూడో జెనరేషన్ వరకు వచ్చేసింది. అయితే ఈ పోటీ హీరోల మధ్య కంటే వారి అభిమానులమధ్య తీవ్రస్థాయికి చేరిపోయింది.

మన హీరోలు ఎన్నోసార్లు వేదికపైకి వచ్చి తామంతా ఒకరితో ఒకరు సన్నిహితంగా వుంటామని అభిమానులు కూడా అలానే ఉండాలని చెప్పిన అభిమానులలో మాత్రం ఆ సాన్నిహిత్యం కనిపించే పరిస్థితి లేదు. అందుకేనేమో మన మూడోతరం హీరోలు ఇప్పుడు మాటలతో కాకుండా చేతలతో వారి మధ్య వున్న స్నేహసంబంధాలు అందరికీ తెలియ చేస్తున్నారు.

ఈ విషయం లో ముందుగా మెచ్చుకోవాల్సింది ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లనే. ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పటి జనరేషన్ లో వీరిద్దరూ అగ్ర హీరోలుగా చలామణి అవుతున్నారు. అయినా ఎటువంటి ఇగోలు లేకుండా ఒకరి సినిమా ఓపెనింగ్ కి క్లాప్ కొట్టడానికి ఇంకొకరు వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇది కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మనుగడకు శుభ సూచికం కానుంది. వీరిని ఆదర్శం గా తీసుకుని ఇకనయినా అభిమానులు హద్దులు దాటకుండా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news