Gossipsరంగస్థలం చూసిన పవన్ కళ్యాణ్.. అసహనంతో వెళ్లిపోయాడు..!

రంగస్థలం చూసిన పవన్ కళ్యాణ్.. అసహనంతో వెళ్లిపోయాడు..!

రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాం చరణ్ సినిమా ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా బాబాయ్ కూడా రాం చరణ్ నటనకు ఫిదా అయ్యాడు. తొలిప్రేమ తర్వాత థియేటర్ లో చూడాలనిపించిన సినిమా రంగస్థలం అన్న పవన్ సినిమాలో చరణ్ నటన అద్భుతమని అన్నారు.

ఇక సినిమా దర్శకుడు సుకుమార్ ను కూడా పొగడ్తలతో ముంచెత్తాడు పవన్ కళ్యాణ్. అయితే సినిమా గురించి మాట్లాడుతున్నా సరే అభిమానులు అక్కడ కూడా పవన్ సిఎం పవన్ సిఎం అని గొడవ చేయడంతో అసహనానికి గురై అక్కడ నుండి త్వరగా వెళ్లిపోవాల్సి వచ్చిందట. పవన్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ హంగామా చూసి ఆయనకే విరక్తి కలిగింది.

మిగతా వారు మాట్లాడేప్పుడు పవన్ అని కేకలేయడం ఓకే కాని పవన్ మాట్లాడేప్పుడు కూడా ఆయన్ను డిస్ట్రబ్ చేసేలా మాట్లాడటం పవన్ కు కోపం తెప్పించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి పవన్ ఎక్కడైనా ప్రస్థావిస్తాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news