Gossipsదొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పటాస్ కమెడియన్

దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పటాస్ కమెడియన్

పటాస్ కమెడియన్ నగారజు అలియాస్ నరేందర్ ఊహించని విధంగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చివరగా పోలీసులకు దొరికి ఊసలు లెక్కెడుతున్నాడు. ఇంటి నిర్మాణ కార్మికుడిగా పనిచేసే నరేందర్ పటాస్ షోలో కంటెస్టంట్ గా చేరి నాగరాజుగా పేరు మార్చుకుని కామెడీ చేస్తూ నవ్విస్తున్నాడు. అయితే విలాసాలకు అలవాటైన నాగరాజు అలియాస్ నరేందర్ దొగతనాలకు అలవాటు పడ్డాడు.

ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న ఇతగాడు ఉదయం ఎవరెవరు ఊళ్లకు వెళ్లారు అన్న విషయం తెలుసుకుని నైట్ దొంగతనాలు చేసేవాడట. వరుసగా ఇలాంటివి జరుగుతుండటంతో పోలీసులు రంగంలో దిగారు ఫైనల్ గా నరేందర్ ను పట్టుకున్నారు. అతని దగ్గర 22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారట.

టివిల్లో నవ్విస్తూ కనిపించే నాగరాజు ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేదు. అయితే విలాసాలకు బాగా అలవాటు పడటం స్నేహితుల ప్రోద్బలంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news