Newsపాక్ నం.1 కారణం భారత్

పాక్ నం.1 కారణం భారత్

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌ సాధించిన ఈ విజయంతో పాక్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్ గెలిస్తే పాకిస్థాన్ అగ్రస్ధానం చేరుకోవడం ఏంటని అనుకుంటున్నారా. అవును నిజమే. పాకిస్థాన్ టీ20 ర్యాంకుల్లో అగ్రస్ధానానికి ఎగబాకింది.
ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను పాక్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో గత మంగళవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పాక్‌ రెండో స్థానంలో నిలవగా కివీస్‌ అగ్రస్థానంలో కొనసాగింది. ఈ రెండు జట్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. 124 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న పాక్‌ అగ్రస్థానానికి ఎగబాకింది. అదన్న మాట జరిగింది. టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో పాక్‌ అగ్రస్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి.అయితే తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో ఓటమి పాలై రండో స్థానానికి దిగజారింది. అదే క్రమంలో భారత జట్టు అమోఘంగా రాణించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌ను భారత్ గనుక క్లీన్ స్వీప్ చేస్తే ఐదో స్ధానంలో ఉన్న భారత్ రెండో స్ధానానికి చేరుకుంటుంది.అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆశిష్ నెహ్రాకు విలియమ్సన్ అభినందనలు తెలియజేశాడు. ‘నెహ్రాతో కలిసి చాలా మ్యాచ్ లు ఆడాను.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news