Moviesఐయాం ద హీరో.. బాలయ్య పైసా వసూల్ టీజర్.. బాలయ్య...

ఐయాం ద హీరో.. బాలయ్య పైసా వసూల్ టీజర్.. బాలయ్య ఇరగొట్టేశాడు..!

క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో బాలయ్య 101వ సినిమాగా రాబోతుంది పైసా వసూల్. భవ్య క్రియేషన్స్ లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీయా హీరోయిన్ గా నటిస్తుంది. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా (ట్రైలర్ కు తక్కువ టీజర్ కు ఎక్కువ) స్టంపర్ అదిరిపోయింది. అన్నా.. రెండు బాల్కనీ టికెట్లు ఇవ్వు అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదుర్స్ అంతే.

ఐయాం ద హీరో.. యు ఆర్ ద కమెడియన్ అంటూ విలన్ కు వార్నింగ్ ఇస్తున్న బాలయ్యను చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పాలి. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. బాలయ్య స్టైలిష్ యాక్షన్ ఇందులో హైలెట్ అవుతుందని కనిపిస్తుంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఆగష్టు 16న రిలీజ్ అవనున్నాయి. సినిమా ఎలా ఉంటుందో శాంపిల్ చూపించిన పూరి బాలయ్య అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయమని హింట్ ఇచ్చేశాడు. స్టంపర్ గా వచ్చిన ఈ పైసా వసూల్ బాలయ్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. ముఖ్యంగా ఈ సినిమా రిజల్ట్ మీద పూరి భవిష్యత్ ఆధారపడి ఉందని తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news