Gossipsదీపికా బార్బీ బొమ్మ అద‌ర‌హో...

దీపికా బార్బీ బొమ్మ అద‌ర‌హో…

సంజ‌య్ లీలా బ‌న్సాలీ  అద్భుత సృష్టికి మ‌రో తార్కాణం ప‌ద్మావ‌తి. నిన్న‌టి వేళ విడుద‌లైన ట్రైల‌ర్ ఒక్క‌టి చాలు ఆయ‌నేంట‌న్న‌ది తెలిపేందుకు.ఇది వర‌కే దీపిక‌తో చేసిన బాజీరావ్ మ‌స్తానీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెల్సిందే! ఈ సారి మ‌రింత అంచనాలు పెంచ‌తూ ప‌ద్మావ‌తి విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది.‘రాజ్‌పుత్‌ల ఖడ్గంలోనే కాదు వారికంకణంలోనూ శక్తి ఉంటుంది’ అంటూ రాణి పద్మిని(పద్మావతి)గా దీపిక పదుకొణె అదరగొట్టేసింది.

ఆహార్యం, గాంభీర్యం, అందంతో పద్మావతి అభిమానులతో పాటు సెలబ్రిటీలనూ ఫిదా చేసేసింది.అంతేకాదు ఇప్పుడు పద్మావతి గెటప్‌లో బార్బీ బొమ్మలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘షింగారి’ అనే సంస్థకు చెందిన బార్బీడాల్‌ రూపకర్తలు ఈ బొమ్మను రూపొందించారు.

ఇది నెటిజ‌నుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. కాగా ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంటల్లోనే ట్రైలర్‌ను కోటి మందికిపైగా వీక్షించి సరికొత్త రికార్డు న‌మోదుచేశారు.డిసెంబర్‌ 1న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మ‌రెన్నో సంచ‌నాల‌న‌కు కేంద్ర బిందువు కానుంది. బ‌న్సాలీ సైతం ఈ సినిమా విజ‌యంపై రెట్టించిన న‌మ్మ‌కంతో ఉన్నార‌ని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news