Movies" పద్మవత్ " రివ్యూ & రేటింగ్

” పద్మవత్ ” రివ్యూ & రేటింగ్

రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే, షాహిద్ కపూర్ లు నటించిన ప్రథ్స్టాత్మక చిత్రం పద్మావత్. రిలీజ్ కు ముందు ఎన్నో వివాదాలను సృష్టించి కోర్ట్ నోటీసులతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఫైనల్ గా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న రిలీజ్ అవుతుంది. సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అల్లావుద్ధీన్ ఖిల్జి అడ్డదారుల్లో సింహాసనం అధిష్టిస్తాడు. ప్రపంచంలో అందమైనవన్ని తన సొంతం కావాలని అనుకునే ఖిల్జికి రతన్ సింగ్ రాజ్ పుత్ అర్ధాంగి మీద కన్ను పడుతుంది. సింహళ యువరాణి అయిన పద్మావతి (దీపికా పదుకునే) మేవార్ రాజ్ పుత్ రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్)ను ప్రేమించి పెళ్లాడుతుంది. మరొకరి భార్య అయినా సరే ఆమెను సొంతం చేసుకునేందుకు రతన్ సింగ్ యొక్క చిత్తూర్ కోటపై యుద్ధం ప్రకటిస్తాడు. రాహుల్ రతన్ సింగ్ ఖిల్జిని ఎలా ఎదుర్కున్నాడు..? పద్మావతిని అతను దక్కించుకున్నాడా..? పద్మావతి అతన్ని ఎలా ఓడించింది అన్నది అస్లౌ సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

ఖిల్జి పాత్రలో రణ్ వీర్ సింగ్ అదరగొట్టాడు. క్రూరత్వం.. పద్మావతిని దక్కించుకునేందుకు అతను వేసే ఎత్తుగడలు నటనలో మరోసారి ఆకట్టుకున్నాడు రణ్ వీర్ సింగ్. ఇక టైటిల్ రోల్ పోశించిన దీపికా కూడా తన వీరత్వం చూపించింది. పద్మావతి పాత్రకు ఆమె చక్కగా సరిపోయింది. అభినయంతో అదరగొట్టింది. క్లైమాక్స్ సీన్స్ లో బాగా నటించింది. ఇక షాహిద్ కపూర్ కూడా రన్ సింగ్ గా బాగానే చేశాడు. సినిమాలో వీరి ముగ్గురు పాత్రలే ప్రధానంగా కనిపిస్తాయి. మిగతా వారంగా బాగా చేశారు.

సాంకేతికవర్గం ప్రతిభ :

సంజయ్ లీలా భన్సాలి మరోసారి తన క్రియేటివ్ టాలెంట్ చూపించారు. చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఎక్కడ చరిత్రను వక్రీకరించకుండా తీశారు. ముఖ్యంగా తనదైన ఎమోషనల్ మార్క్ మాత్రం మిస్ చేయలేదు. పాటల్లో అంత పట్టు లేకున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సిజి వర్క్ అద్భుతంగా చేశారు. కెమెరామన్ పనితనం బాగుంది. సినిమాలో వాడిన కాస్టూంస్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

చరిత్రను సినిమాగా తెరకెక్కించే సందర్భంలో చరిత్రను వక్రీకరించకుండా సినిమా తెరకెక్కించాలి. ఆ విషయంలో పద్మావత్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలి తన ప్రతిభ కనబరిచారు. ప్రతి ఫ్రేం లో సినిమాను రిచ్ గా చూపించారు. అయితే రాజుల నాటి కథ కాబట్టి భారీ యుద్ధ సన్నివేశాలు ఆశిస్తారు. కాని భన్సాలి మాత్రం ఇది కూడా తన మార్క్ కలిగిన ఎమోషనల్ డ్రామాగా నడిపించాడు.

సినిమాలో ఆ ఒక్క యాస్పెక్ట్ తప్ప మిగతా సినిమా అంతా బాగా నడిపించాడు. తొలి భాగం పాత్రల పరిచయం.. వారి ఎస్టాబ్లిష్ మెంట్ కు కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. ముఖ్యంగా తన 800ల మంది దాసీలతో ఖిల్జిపై పద్మావతి చేసే దండయాత్ర భన్సాలి డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపిస్తుంది.

ఇక క్లైమాక్స్ లో రాజ్ పుత్ ల త్యాగాన్ని బాగా ఎలివేట్ చేశారు. మొత్తానికి ఎన్నో గొడవల మధ్య రిలీజ్ అవుతున్న ఈ పద్మావత్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. బాహుబలి ఇంపాక్ట్ లేకున్నా సరే యుద్ధం సన్నివేశాలు లేకపోవడం వల్ల కాస్త నిరాశ చెందే అవకాశం ఉంటుంది. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా ఎక్కుతుంది.

ప్లస్ పాయింట్స్ :

డైరక్షన్

స్టోరీ టెల్లింగ్

ఎమోషనల్ సీన్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

పాటలు

క్లైమాక్స్

బాటం లైన్ :

భన్సాలి పద్మావత్ ఎమోషనల్ ట్రీట్..!

రేటింగ్ : 3/5

https://www.youtube.com/watch?v=8YaF2m7hCx0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news