Gossipsమళ్ళి ఎన్టీఆర్ ని డి కొట్టబోతున్న జగ్గుభాయ్...ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్..!

మళ్ళి ఎన్టీఆర్ ని డి కొట్టబోతున్న జగ్గుభాయ్…ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఈ నెల చివరన సెట్స్ మీదకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. జై లవ కుశ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రత్యేకంగా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. అందుకు తగిన వర్కవుట్స్ కూడా చేస్తున్నాడని ఈమధ్య వార్తల్లో కూడా వచ్చింది.

ఇక ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబుని తీసుకుంటున్నారట. ఆల్రెడీ తారక్ తో నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్ గా ఢీ కొట్టిన జగ్గూ భాయ్ మరోసారి త్రివిక్రం సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నాడట. హీరోగా కెరియర్ ఫుల్ స్టాప్ పెట్టి విలన్ గా కొత్త ఉత్సాహంతో కెరియర్ టర్న్ తీసుకున్న జగపతి బాబు వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు.

అయితే నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతి బాబు క్లాసిక్ విలన్ గా కనిపించాడు. ఇద్దరు మైండ్ గేం తోనే ఫైట్ చేస్తారు అయితే త్రివిక్రం సినిమాలో మాత్రం ఎన్.టి.ఆర్, జగపతి బాబు మధ్య క్రేజీ ఫైటింగ్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. మరి తారక్ తో జగపతి ఈసారి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవనుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news