ఆ లక్కీ హీరోయినే కావాలంటున్న ఎన్టీఆర్..?

ntr wants that lucky girl as heroine in his next movie

Eveyone knows that young tiger NTR is doing his next movie with director bobby which is going to be launch on 9th Dec. Present the movie unit searching for heroine and other cast. When Tarak about know about this, he discussed with unit members and suggest to take that lucky girl as heroine. Read below story to know who is that girl?

సెంటిమెంట్లకు టాలీవుడ్ పెట్టింది పేరు. చాలా సందర్భాల్లో ఇవి నిజమవ్వడంతో.. టెక్నీషియన్ల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతిఒక్కరూ పాటిస్తున్నారు. ఇప్పుడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడు. తనతో కంటిన్యూగా నాలుగు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్‌నే మరోసారి తీసుకోవాలని యోచిస్తున్నాడని సమాచారం. తన కెరీర్‌లో అన్నేసి సినిమాల్లో ఒకే హీరోయిన్ నటించడం, అన్నీ హిట్ అవ్వడంతో.. ఆమెని లక్కీ గాళ్‌గా భావిస్తున్నాడట. అందుకే.. తన తదుపరి చిత్రంలోనూ ఆమెని తీసుకుంటే.. హిట్ సెంటిమెంట్ కలిసొస్తుందని ఆలోచిస్తున్నాడట. ఇంతకీ ఆ భామ ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. కాజల్ అగర్వాల్.

ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ ‘బృందావనం’, ‘బాద్‌షా’, ‘టెంపర్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించగా.. ‘జనతా గ్యారేజ్’లో ఓ ఐటెం సాంగ్‌లో అతనితో ఆడిపాడింది. ఆ నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో.. కాజల్ తన కెరీర్‌కి లక్కీ గాళ్‌గా తారక్ భావిస్తున్నాడట. అందుకే.. బాబీ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఈ విషయమై ఆల్రెడీ బాబీ, చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్‌లతో మాట్లాడాడనీ.. ఆమెనే తీసుకోవాలని రికమెండ్ కూడా చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకైతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాదు.. దాదాపు కాజల్‌నే ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఒకవేళ ఆ భామని తీసుకుంటే.. తారక్‌తో ఐదు సినిమాలు కంటిన్యూగా చేసిన తొలి స్టార్ హీరోయిన్‌గా అమ్మడు ఖాతాలో ఓ రికార్డ్ చేరిపోతుంది. కాగా.. ఈ సినిమాని ఈనెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్ళేలా సన్నాహాలు చేస్తున్నారు.

More from my site