Newsఎన్.టి.ఆర్, త్రివిక్రం షూటింగ్ స్టార్ట్..!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం షూటింగ్ స్టార్ట్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతుండగా దానికి ముందే ఎన్.టి.ఆర్ ను త్రివిక్రం డైరక్షన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అదేంటి ఈ ఇద్దరు సినిమాకు కాకుండా మరి దేనికి షూటింగ్ చేస్తున్నరు అంటే.. ఈమధ్యనే స్టార్ మాతో ఐపీఎల్ కోసం ఎన్.టి.ఆర్ భారీ డీల్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

స్టార్ మా తెలుగు కామెంటేటర్ చానెల్ కోసం కావాల్సిన ప్రకటనలు, ప్రోమోస్ కోసం ఈ షూట్ జరుగుతుంది. ఈ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఓ విల్లాలో జరుగుతుందట. దీనికి సంబందించిన న్యూస్ నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఇప్పటికే ఎన్.టి.ఆర్, మహేష్ లతో యాడ్స్ చేసిన త్రివిక్రం ఈ ఐపీఎల్ కోసం ఎన్.టి.ఆర్ తో స్పెషల్ షూట్స్ చేస్తున్నాడు.

ఇక ఇది పూర్తి కాగానే ఏప్రిల్ మొదటి వారం నుండి వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తుండగా పూజా హెగ్దె, శ్రధా కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news