Gossipsఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలయ్యే డేట్ వచ్చిందోచ్ !!

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలయ్యే డేట్ వచ్చిందోచ్ !!

కే ఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ షూటింగ్ లో మూడు పాత్రలతో బిజీ బిజీ గా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తర్వాతి సినిమాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న జై లవకుశ సెప్టెంబర్ 21 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఒక పక్క జై లవకుశ షూటింగ్ మరియు మరో పక్క స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షూటింగ్ లతో బిజీ గా ఉంటూనే, తన తర్వాతి త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కథా చర్చల్లో కూడా పాల్గొంటున్నాడు తారక్.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల సినిమా నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో తారక్ తన ఇమేజ్ కి బిన్నంగా ఉంటూనే, తన ఫ్యాన్స్ ని అలరించేలా, త్రివిక్రమ్ మార్క్ పాత్రని పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని 2018 వేసవి సెలవుల్లో విడుదల చేసుకొనేలా పక్కా ప్రణాళికని సిద్ధం చేశారంట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో త్రివిక్రమ్ బిజీ గా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news