Gossipsఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్ : ఫ్యాన్స్ కి...

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్ : ఫ్యాన్స్ కి పూనకాలే !!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 12 న రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం భారీ సెట్ ఒకటి వేశారట. అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఈ సెట్ వేశారని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట దర్శక నిర్మాతలు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అదీకాకుండా ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం చేస్తున్న మొదటి సినిమా ఇదే. మరి అలాంటిది కేవలం సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలని అనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ సినిమా దసరాకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాక పోవడం తో కొంత నిరాశ లో ఉన్న ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండగ లాంటి వార్తే.

అయితే మరో పక్క ఎన్.టి.ఆర్ రాజమౌళి సినిమా అక్టోబర్ నుండి మొదలు పెట్టాల్సి ఉంది. అందుకే త్రివిక్రం సినిమా సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయాలని భావిస్తున్నాడు. అందుకే ప్రీ ప్రొడక్షన్ లోనే సినిమా షెడ్యూల్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. మొత్తానికి కెరియర్ లో ఎన్.టి.ఆర్ మొదటిసారి సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలని అనుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news