Gossipsమలయాళీ బ్యూటీ తో ఎన్టీఆర్ రొమాన్స్..

మలయాళీ బ్యూటీ తో ఎన్టీఆర్ రొమాన్స్..

ఈ కేర‌ళ సోయ‌గం మ‌జ్నూతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది
ఇటీవ‌లే హైద్రాబాద్‌లో ఓ ఫ్లాట్ కూడా కొనుక్కొని ఇక్క‌డే సెటిల్ అయిపోదామ‌ని భావిస్తోంది కూడా!
తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది అదేంటంటే..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తసినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. నిన్నటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఈ సిని మాలో రెండో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తోందంటూ.. దాదాపుగా ఆమె ఎంపిక కూడా జరిగిపోయిందంటూ మరో వార్త షికారు చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పవన్ హాజరైన సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ ప్రస్తుతం పవర్‎స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన 25వ సినిమా చేస్తున్నారు. ఇందులో కూడా అనూ ఇమ్మాన్యుయేల్ ఒక హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. 2018 జనవరి కల్లా ఈ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు త్రివిక్రమ్.ఇక ఈ సినిమాలో సునీల్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కమెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు త‌న స్నేహితుడి సాయం తీసుకుంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news