Gossipsఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా ...! 

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా …! 

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జై లవ కుశతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ లో చేసిన అభినయం అందరిని అవాక్కయ్యేలా చేసింది. కెరియర్ ఒడిదుడుకులలో ఉన్న తారక్ టెంపర్ సినిమా నుండి తన పంథా మార్చుకున్నాడు. సినిమాల సెలక్షన్ మాత్రమే కాదు సినిమా సినిమాకు పెద్ద గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు తారక్.

ప్రస్తుతం ఫాంలో ఉన్న తారక్ ను అనుకోకుండా 6 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కల్పించాడు త్రివిక్రం. తారక్ తో తర్వాత సినిమా కమిట్ అయిన త్రివిక్రం అసలైతే సినిమాను నవంబర్ కల్లా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. కాని పవన్ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో ఎన్.టి.ఆర్ సినిమా కూడా లేట్ అవ్వొచ్చని తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్ తో ఎన్.టి.ఆర్ సినిమా మార్చి నెలలోనే స్టార్ట్ అవుతుందట. సెప్టెంబర్ నుండి మార్చి దాకా అంటే దాదాపు 6 నెలలు సినిమా చేయకుండా ఎన్.టి.ఆర్ ఖాళీగా ఉండాల్సిందే. కొరటాల శివ సినిమా కూడా క్యాన్సిల్ చేసుకుని త్రివిక్రంతో సినిమా ఫిక్స్ చేసుకున్న ఎన్.టి.ఆర్ సినిమా కోసం వెయిట్ చేయక తప్పదని తెలుస్తుంది.

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news