Gossipsఎన్టీఆర్ తో పోటీ కి సై అంటున్న ఆ మెగా హీరో

ఎన్టీఆర్ తో పోటీ కి సై అంటున్న ఆ మెగా హీరో

ముకుంద మూవీతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు తనయుడు అయిన వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణ సంస్థలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీతో మహిళా ఫ్యాన్స్ల మనసును తన వైపు తిప్పుకున్నాడు ఈ మెగా హీరో.

DNYzmimVoAIZ6O_

వరుణ్ తేజ్ కి మిగతా మెగా హీరోల కంటే మంచి అభినయంతో పాటు అందం, హైట్ ఉండడంతో కాస్త కలిసొచ్చే విషయం. కాగా తన రాబోయే సినిమాలో కొంచం బిన్నంగా కనిపించబోతున్నట్టు సమాచారం.అంతేకాకుండా ఈ సినిమాలో వరుణ్ ఏకంగా మూడు డిఫరెంట్ క్యారెక్టర్లులో కనిపించనున్నాడు.ఈ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు కూడా వేటికవే ఒకదానికి ఒకటి భిన్నంగా, చాలా కొత్త గా ఉంటాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ . ఇప్పటికే ఒక ఈ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు లలో ఒక దానిని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో.. మిగిలిన ఆ రెండు క్యారక్టర్ లని కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు చిత్ర యూనిట్.

DNddG1YVwAAkGUg

DNdEbd5UMAAsk_b

ఈ మూవీతో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.ఈ మూవీని 2018 ఫిబ్రవరి 14న వచ్చే లవర్’స్ డే సందర్బంగా ఒక వారం ముందుగానే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

DNXL7A6WsAANNWQ DMGTOrjVQAEq5tU DNdEbd5UMAAsk_b

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news