Gossipsకొత్త కథకి శ్రీకారం చుట్టనున్న ఎన్టీఆర్

కొత్త కథకి శ్రీకారం చుట్టనున్న ఎన్టీఆర్

యాంగ్ టైగర్ ఎన్టీఆర్  ‘జై లవకుశ’ సినిమాతో ఇటీవలే ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.షూటింగ్ మొదలయ్యే లోపు ఎన్టీఆర్ ఈ చిత్రం లోని పాత్రకి తగిన విధంగా తనని తాను మార్చుకోనున్నారని సమాచారం. అయితే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కావటానికి సుమారు రెండు నెలలకిపైగా సమయం ఉంది కావున ఎన్టీఆర్‌ తదుపరి చిత్రాల కోసం మరికొన్ని కథలు వీనే ఆలోచనలో ఉన్నారట.

ఎన్టీఆర్‌ కోసం ఓ  ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ కుటుంబ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ యేడాది ఆరంభంలోనే ఓ కుటుంబ కథని తీసి మంచి విజయాన్ని అందుకున్న ఆ దర్శకుడే మళ్ళి అదే తరహా చిత్రాన్ని తీసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news