Gossipsఅసలు నిజాలపై ఎన్టీఆర్ ఆరా..!!

అసలు నిజాలపై ఎన్టీఆర్ ఆరా..!!

గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హత్యకి సంబందించిన వార్తలు, ఇటు సామాన్యులనే కాకుండా అటు టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తున్నాయి. మీడియాలో వస్తున్నట్లుగా ఇద్దరు టాప్ హీరోల ఫాన్స్ మధ్య గొడవలో భాగంగానే హత్య జరిగిందా లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కోలార్ పోలీసులు విచారణ చేపట్టారు.

నిన్న తిరుపతి లోని వినోద్ ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ వినోద్ కుటుంబ సభ్యులని ఓదార్చడంతో పాటు వారికి అండగా ఉంటానని… అలాగే ఈ హత్యకు కారణమైన వారికి శిక్ష పడేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని చెప్పటం జరిగింది.ఒకవేళ రాష్ట్ర స్థాయిలో విచారణ ఫెయిల్ అయితే… సిబిఐ చేత విచారణ జరిపించి వినోద్ కుటుంబానికి న్యాయం చెయ్యాలని పవన్ డిమాండ్ చేశాడు.

ఇక మీడియాలో వస్తున్నట్లుగా వినోద్ ని హత్య చేసింది నిజంగా ఎన్టీఆర్ అభిమానులేనా అనే దిశగా ఎన్టీఆర్ సైతం వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలిసింది. వినోద్ హత్య విషయంపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటంతో పాటు అసలు నిజాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో కలత చెందినట్లుగా తెలిసింది.అందరి హీరోల మధ్య ఎంతో ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది… కానీ ఇలా హత్యలకు దారి తీసేంతలా హీరోలపై పిచ్చి అభిమానం ఎవరికీ శ్రేయస్కరం కాదని అన్నట్లుగా తెలిసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news