Gossipsసంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Young tiger NTR has rejected a huge offer recently. After knowing why, everyone will appreciate with NTR’s decision. If all heroes will follow his decision, then soon Tollywood will reach to higher position. Read the full story why he rejected that offer and what is link to Tollywood.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘టెంపర్’తో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఈ హీరో.. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తొలిసారి రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడంతోపాటు కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇక ‘జనతా గ్యారేజ్’తో లెక్కలేనన్ని రికార్డులు బద్దలుకొట్టడంతోపాటు సరికొత్తవి సృష్టించాడు కూడా. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో ఆ చిత్రాన్ని ఆల్‌టైం రికార్డుల జాబితాలో మూడో స్థానంలో చేర్పించి.. తన సత్తా చాటుకున్నాడు. దీంతో.. ఈ హీరోతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. భారి పారితోషికం ఇవ్వడానికి కూడా రెడీ అంటున్నారు.

రీసెంట్‌గా ఓ స్టార్ ప్రొడ్యూసర్‌ తారక్‌తో సినిమా చేయాలని భావించి.. అతనిని సంప్రదించాడట. తన నిర్మాణంలో ఓ సినిమా చేయమని, అందుకు రూ.25 కోట్ల పారితోషికం ఇస్తానని ఆ నిర్మాత చెప్పాడట. ఇద్దరిమధ్య దాదాపు ఒక గంటసేపు మంతనాలు జరగడంతో.. ఈ మూవీకి అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని ఆ ప్రొడ్యూసర్ భావించాడట. కానీ.. చివరి నిముషంలో ఈ ప్రాజెక్ట్ చేయనని తారక్ సున్నితంగా తిరస్కరించాడట. అతనిని ఒప్పించేందుకు నిర్మాత ఎంతగానో ప్రయత్నించినా.. తాను మాత్రం ఈ మూవీ చేయనంటే చేయనని ఖరాఖండీగా తేల్చి చెప్పాడట. దీంతో.. చేసేదేమీలేక ఆ నిర్మాత వెనుదిరిగినట్లు తెలుస్తోంది. భారీ పారితోషికం వస్తున్నప్పటికీ తారక్ ఈ సినిమాని ఒప్పుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందిలెండి.

అదేమిటంటే.. ఆ నిర్మాత ఓ రీమేక్ సినిమా చేయమని తారక్‌ని కోరాడట. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ సినిమాని.. తెలుగు చేసేందుకు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. ఆ మూవీ ఎన్టీఆర్‌తో చేయాలని భావించి.. అతడ్ని సంప్రదించాడు. అయితే.. రీమేక్ చిత్రాలు చేయడం ఇష్టం లేకపోవడంతోనే తారక్ ఈ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. గతంలో కూడా తారక్ తనకి రీమేక్ మూవీలు చేయడం ఇష్టం లేదని, ఒరిజినల్ కంటెంట్‌తోనే సినిమాలు చేయడం ఎక్కువ ఆసక్తి అని చెప్పాడు. ఈ ఆలోచన విధానానికి ఎన్టీఆర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

రీమేక్ చిత్రాలు చేయడం వల్ల ఆ పరిశ్రమకి మంచి పేరు వస్తుందే తప్ప.. టాలీవుడ్‌కి రాదు. పైగా.. రైట్స్, గట్రా అంటూ ఖర్చు కూడా చేయాలి. అదే ఒరిజినల్ కంటెంట్‌తో చేస్తే.. లోపల దాగివున్న ట్యాలెంట్ బయటికొస్తుంది. అది తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి.. తారక్‌లాగే అందరూ ఆలోచిస్తే, టాలీవుడ్ త్వరలోనే మరో స్థాయికి చేరుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news