Gossipsత్రివిక్రమ్ మాటమీద నిలబడుతున్న ఎన్టీఆర్

త్రివిక్రమ్ మాటమీద నిలబడుతున్న ఎన్టీఆర్

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం జై ల‌వ‌కుశ ఈ సినిమా తనకు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా నాలుగో ఘన విజయం గ నిలిచింది. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా కమిట్ అయినా విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రిత‌మే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ సినిమాకి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి తన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్మీలో ప‌నిచేసే యువ‌కుడిగా నటించనున్నారట. అయితే సినిమా స్టోరీ మాత్రం త్రివిక్ర‌మ్ స్టైల్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘సోల్జ‌ర్’ అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉందట చిత్ర బృందం.

ఈ సినిమాలో ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు కనిపించ‌ని స్టైలీష్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడని సమాచారం. త్రివిక్ర‌మ్ సలహా మేర‌కు ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఈ కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇన్నాళ్లు గడ్డంతో రఫ్ లుక్ లో కనబడిన ఎన్టీఆర్ ఈ సినిమాలో మాత్రం పూర్తిగా షేవ్ చేసి క్లాస్ లుక్ లో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తన కొత్త లుక్ లో ఫ్యాన్స్ ని ఎంత వరకు మెప్పిస్తారో వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news