Newsసోషల్ మీడియాలో లీకైన యంగ్ టైగర్ న్యూ లుక్ ... దుమ్ముదుమారమే...

సోషల్ మీడియాలో లీకైన యంగ్ టైగర్ న్యూ లుక్ … దుమ్ముదుమారమే (ఫోటో)..!

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే తారక్ తో మరో యాడ్ ఫిల్మ్ షూట్ చేస్తున్నాడు త్రివిక్రం. స్టార్ మా ఐపిఎల్ కోసం చేస్తున్న ఈ ప్రమోషన్స్ లో ఎన్.టి.ఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వస్తున్నాడు. ఇక ఈ షూట్ కు సంబందించిన పిక్స్ ప్రస్తుతం లీక్ అయ్యాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్స్ దుమ్మురేపుతుండటం విశేషం. న్యూ లుక్ లో ఎన్.టి.ఆర్ అదుర్స్ అనేలా ఉన్నాడు. జనతా గ్యారేజ్, జై లవ కుశ కోసం బొద్దుగా మారిన తారక్ ఇప్పుడు స్లిం లుక్ లో సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ఈ ప్రోమోస్ ప్రత్యేకంగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు. స్టార్ హీరోల యాడ్ మేకింగ్ లో త్రివిక్రం స్టైలే వేరు. మరి స్టార్ మాలో వచ్చే ఎన్.టి.ఆర్ యాడ్స్ ఎలా ఉండబోతాయో చూడాలి. ప్రస్తుతం లీక్ అయిన ఈ ఎన్.టి.ఆర్ పిక్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి.

ntr

ntr2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news