Moviesలాల్చి పైజామ.. కొంచెం గెడ్దం.. జై లవ కుశ లో కొత్త...

లాల్చి పైజామ.. కొంచెం గెడ్దం.. జై లవ కుశ లో కొత్త అవతారం.. షూట్ పూర్తి వివరాలు

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. బాబీ తో జై లవకుశ సినిమా ఓకే అన్న తర్వాత.. షూటింగ్ ఏమాత్రం ఆలస్యం అవకుండా, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగుతుంది. రేపటి నుండి సాగే కొత్త షెడ్యూల్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబందించిన షూట్ జరగనుంది. ఇంటర్వెల్ బ్లాక్ కి సంబంధించి అది కూడా ఎన్టీఆర్ లుక్ గురించి ఒక సూపర్ న్యూస్ బయటకి వచ్చింది.

లాల్చి పైజామ.. కొంచెం గెడ్దం.. కంటికి సుర్మాతో.. కొత్త యన్.టి.ఆర్ ని చూడబోతున్నాం.. అవును సరి కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నాము. రేపటి నుండి మొదలవనున్న ఇంటర్వెల్ బ్యాంగ్ షూట్ లో, ఒక పాత్రలో ఎన్టీఆర్ కొత్త అవతారం ఇదే. నిర్విరామంగా జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ మూడు పాత్రలకోసం చాలా కష్టపడుతున్నాడు. ఒక పాత్రకి మరొక పాత్రకి లుక్ లో తేడాతో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా తేడా ఉండేటట్లు పాత్రల స్వభావాన్ని బాబీ తీర్చిదిద్దితే… దానికి వంద శాతం, ఎక్కువ సమయం తీసుకోకుండానే.. పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తున్నాడట యంగ్ టైగర్.జై లవకుశ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ కూడా షూటింగ్ లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.ఇక ఈమధ్యనే కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమా ఎం.ఎల్.ఏ.(మంచి లక్షణాలున్న అబ్బాయి) ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news