Gossipsఎన్టీఆర్ లుక్ వెనుక అంత కష్టం ఉందా..

ఎన్టీఆర్ లుక్ వెనుక అంత కష్టం ఉందా..

జై లవ కుశ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం సినిమా చేస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా లో ఎన్.టి.ఆర్ లుక్ కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈమధ్యనే ఎన్.టి.ఆర్ కు సంబందించిన వర్కవుట్స్ బయటకు రాగా లేటెస్ట్ గా తన ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్.టి.ఆర్ పిక్ ఒకటి ట్విట్టర్ లో షేర్ చేశాడు.

అనుకున్నది సాధించేందుకు ఎన్.టి.ఆర్ ఎంత కష్టమైనా పడతాడు అనేందుకు ఆ పిక్ ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ నిజంగానే గ్రేట్ అని చెప్పేందుకు ఈ పిక్ ఉదాహరణ. ఈమధ్యనే ఐపిఎల్ యాడ్ తో సర్ ప్రైజ్ చేసిన తారక్ సినిమాలో క్రేజీ లుక్ తో కనిపిస్తాడట. ఇక రాజమౌళి సినిమాలో అయితే పూర్తి స్థాయిలో మేకోవర్ ఉంటుందట.

ఆ సినిమా కథ వినలేదు అంటూనే బాడీ షేప్ పై దృష్టి పెట్టిన ఎన్.టి.ఆర్ చూస్తుంటే మల్టీస్టారర్ కోసం బాగానే గురి పెట్టినట్టు తెలుస్తుంది. మరి సినిమా పూర్తి అప్డేట్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news