Movies ఎన్టీఆర్ ‘ఆ కోటి’ క్లబ్‌లో చేరుతాడా? లేదా?

ఎన్టీఆర్ ‘ఆ కోటి’ క్లబ్‌లో చేరుతాడా? లేదా?

Young tiger NTR and Kajal Agarwal’s special song in Janatha Garage has crossed more than 92 lakhs on youtube. Cine pandits hoping that this song will cross 1 crore views in few days which is another rare record for Tarak.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాదిలో తన రెండు సినిమాలతో భారీ విజయాలు సాధించి.. ‘హీరో ఆఫ్ ది ఇయర్ 2016’గా పేరుగాంచాడు. అంతేకాదు.. ఈ రెండు చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దాంతో.. అక్కడ కూడా ఇతని పేరిట ఎన్నో రికార్డులు నమోదై ఉన్నాయి. ముఖ్యంగా.. యూట్యూబ్‌లో ఇతని సినిమాల టీజర్లు అత్యధిక వ్యూస్ రాబట్టాయి. ఇప్పుడు మరో ఫీట్‌ని అందుకుంటాడా? లేదా? అన్నది టెన్షన్ నెలకొంది. ఇంతకీ ఏ విషయం అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్‌పై తెరకెక్కించిన ‘పక్కా లోకల్’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతోంది. దాంతో.. 92 లక్షలపైగా వ్యూస్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి గీతామాధురి వాయిస్ ఓ హైలైట్ అయితే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఎన్టీఆర్-కాజల్‌ల స్టెప్పులు ఆ పాటను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. అందుకే.. నెటిజన్లు ఇంకా ఇరగబడి ఆ పాటని చూస్తున్నారు. ఇప్పటివరకు 92 లక్షల మందికిపైగా ఈ పాటని వీక్షించడంతో.. కోటి క్లబ్‌లో చేరుతుందా? లేదా? అనేది ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఇది ఖచ్చితంగా ఆ ఫీట్‌ని అందుకుంటుందని విశ్లేషకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. అంటే.. ఈ పాటతో తారక్ మరో అరుదైన ఘనతను సాధించనున్నాడన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news