Newsఅర్ధరాత్రి ఎన్.టి.ఆర్ అభిమానుల హంగామా.. అభిమానమంటే ఇదేనెమో ..!

అర్ధరాత్రి ఎన్.టి.ఆర్ అభిమానుల హంగామా.. అభిమానమంటే ఇదేనెమో ..!

అభిమాన నటుడి పుట్టినరోజు అంటే ఆ అభిమానుల హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. ఎవరికి తోచినట్టుగా వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈరోజు ఎన్.టి.ఆర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అర్ధరాత్రి ఎన్.టి.ఆర్ ఇంటిముందు అభిమానులు బారులు తీరారు.

ఒకప్పుడు పెద్ద ఎన్.టి.ఆర్ కు ఇలా అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు సందర్భంగా ఇంటిముందు హంగామా చేసేవారు. ఇక ఇప్పుడు ఈ ఎన్.టి.ఆర్ కు ఇలా అభిమానుల కోలాహలం షురూ అయ్యింది. అభిమానమంటే ఇదేరా అన్నట్టుగా జూనియర్ ఫ్యాన్స్ హడావిడి ఎన్.టి.ఆర్ క్రేజ్ ను తెలియచేస్తుంది.

ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలను పెంచింది. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో తారక్ లుక్ ఇంప్రెస్ చేసింది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news