Gossipsఎన్టీఆర్ అభిమానులా మజాకా.. ఎన్టీఆర్ కి అదిరిపోయే గిఫ్ట్

ఎన్టీఆర్ అభిమానులా మజాకా.. ఎన్టీఆర్ కి అదిరిపోయే గిఫ్ట్

టాలీవుడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. కొన్నాళ్లు కెరియర్ లో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా సరే ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మే 20న ఎన్.టి.ఆర్ పుట్టినరోజు అయితే అభిమానులు ఎన్.టి.ఆర్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు.

తారక్ ఫ్యాన్స్ అతనికి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అంటే 35 రోజుల నుండే బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. అది కూడా ఒక్కోరోజు ఒక్కో సినిమా స్టిల్ తో పోస్టర్స్ రిలీజ్ చేస్తారట. ప్రస్తుతం బాల రామాయణంలో ఎన్.టి.ఆర్ పోస్టర్ తో ఈ సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. గుణశేఖర్ డైరక్షన్ లో బాల రామునిగా నటించాడు ఎన్.టి.ఆర్.

తాత నందమూరి తారక రామారావు దర్శకత్వంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో ఎన్.టి.ఆర్ మొదటి తెరంగేట్రం చేశాడు. అయితే పుస్తకం ముఖ చిత్రం మాత్రం రామునిగా తారక రాముడితోనే వస్తుంది. 35 పోస్టర్స్ తో ఈ బుక్ ప్రింట్ చేయనున్నారు. అంతేకాదు ప్రతి రోజు పోస్టర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా అభిమానుల ఈ కానుకను యంగ్ టైగర్ కూడా ఫిదా అవుతాడని చెప్పొచ్చు.

ntr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news