Moviesమహానటిలో భాగమైన ఎన్టీఆర్

మహానటిలో భాగమైన ఎన్టీఆర్

మహానటి సావిత్రి బయోపిక్ గా కీర్తి సురేష్ లీడ్ రోల్ గా మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల రెండో వారంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎవడే సుబ్రమణ్యం డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది. సావిత్రి జీవిత చరిత్ర కథతో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో జరిగిన అన్ని విషయాలను ఇందులో ప్రస్థావించడం జరిగిందట. ఇక ఈమధ్యనే మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ అటెండ్ అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక అదే సెంటిమెంట్ తో మహానటి సినిమా ఆడియోకి ఎన్.టి.ఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, క్రిష్ లాంటి భారీ తారాగణం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news