Gossipsషాకింగ్ ట్విస్ట్: కోన రాకతో ఆగిపోయిన తారక్-బాబీ సినిమా?

షాకింగ్ ట్విస్ట్: కోన రాకతో ఆగిపోయిన తారక్-బాబీ సినిమా?

Shocking news for NTR fans. His latest film under bobby directorial which is going to be launch on 10 december has been shelved because of Kona Venkat. Read the full story what is relationship with kona and tarak’s project.

సుమారు మూడు నెలలు సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా కోసం బాబీని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు. అతడు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ అవ్వడం.. అంతా చకచకా జరిగిపోయాయి. ఈనెల 10వ తేదీన లాంఛనంగా ప్రారంభించాలని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే.. ఇంతలోనే కోన వెంకట్ ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో.. తారక్, బాబీ డైలామాలో పడిపోయారు. ఇంతకీ.. కోనకి, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

ప్రస్తుతం తారక్‌తో సెట్స్ మీదకి వెళ్తామని బాబీ ప్రిపేర్ చేసుకున్న కథని కోన వెంకట్ రాశాడట. అతని దగ్గర నుంచి కథ తీసుకొని, కొన్ని మార్పులుచేర్పులు చేసి ఎన్టీఆర్‌కి వినిపించాడు బాబీ. అది నచ్చడంతో సెట్స్ మీదకి వెళ్దామని అనుకునేలోపే.. కోన వెంకట్ పెద్ద బాంబ్ పేల్చాడు. అదేంటంటే.. ఆ కథని తాను ఆల్రెడీ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ని వినిపించడమే కాదు.. ఫ్యాన్సీ రేటుకి అమ్మేశాడట. ఈ విషయం తెలుసుకున్న తారక్, బాబీలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో.. ఈ కథని అభిషేక్ బచ్చన్‌ని బుజ్జగించి వెనక్కు తెచ్చుకోవాలా? లేద ఈ కథ విషయం మరిచిపోయి మరో ఫ్రెష్ కథ రెడీ చేసుకోవాలా? అన్న డైలామాలా పడిపోయారు. ఒకవేళ కోన నిజంగానే ఆ కథని అభిషేక్‌కి అమ్మేస్తే.. బాబీకి ఎందుకిచ్చాడు? అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

సరే.. అయ్యిందేదో అయిపోయిందనుకుని, బాబీ మరో ఫ్రెష్ కథని రెడీ చేసే పనిలో పడిపోయాడట. ఆల్రెడీ తన దగ్గర స్టోరీలైన్ ఉంది కాబట్టి, అది తారక్‌కి వినిపించాడట. ఆ స్టోరీలైన్ నచ్చడంతో.. దానిపై వెంటనే కథ రెడీ చేయమని చెప్పాడని తెలుస్తోంది. మరి.. ఈ కథని డిసెంబర్ 10లోపు బాబీ రెడీ చేస్తాడా? లేదా? చూడాలి. చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కేలా లేదు. ఫ్యాన్స్‌కి ఇంకా చాలారోజులు వెయిట్ చేయక తప్పదన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news