Gossipsఎన్టీఆర్ బయోపిక్ ట్రీజర్ అలా ఉండబోతోందా ..?

ఎన్టీఆర్ బయోపిక్ ట్రీజర్ అలా ఉండబోతోందా ..?

నందమూరి హీరో కళల ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ కూడా శరవేగంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తేజ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించనున్నాడు. ఇక మ‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ త‌న తండ్రి హ‌రికృష్ణ పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు. ఈ సినిమాను ఆయనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని సీనియర్ ఎన్టీఆర్ జయంతి రోజున అంటే వచ్చే సంవత్సరం మే 28 న ఈ సినిమా విడుదల కానున్నదని తేజ ప్రకటించాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ టీజర్ లను విడుదల చేయలేదు. వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండడంతో ఈ లోపు ఓ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తేజ ఓ ఆసక్తికర టీజర్ ను రూపొందించాడని సమాచారం. బాలయ్య ఒకే చెప్పిన వెంటనే దీన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు తేజ . ఈ సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారో వాటన్నిటిని కలిపి టీజర్ లో చూపించబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కు సంబంధించిన కీలకమైన ఫోటోలతో పాటు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన డైలాగ్స్ తో కలిపి ఈ టీజర్ ని రూపొందించారట. ఈ టీజర్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి నేపథ్య సంగీతం అందించారు.
సౌత్ పరిశ్రమకి చెందిన అలనాటి స్టార్ హీరోలు కొందరు ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కానున్నారు అని తెలుస్తోంది ఏఎన్ ఆర్, శోభన్ బాబు, కృష్ణ, ఎంజీఆర్, రాజ్ కుమార్ , రాజ్ కపూర్ తదితరుల పాత్రలు కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news