Gossipsఇది కదా న్యూస్ అంటే.. నందమూరి బ్యానర్లో నాచురల్ స్టార్..!

ఇది కదా న్యూస్ అంటే.. నందమూరి బ్యానర్లో నాచురల్ స్టార్..!

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు భలే సరదా అనిపిస్తాయి. అలాంటి క్రేజీ కాంబోలోనే ప్రస్తుతం సినిమా తెరకెక్కుతుంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ తన నాచురల్ నటనతో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తున్న నాని రీసెంట్ గా నిన్ను కోరితో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్నాడు నాని. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమా తర్వాత నాని మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం వస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత నాని నందమూరి కళ్యాణ్ రాం బ్యానర్లో సినిమా చేస్తున్నాడట. ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నాని ఓ సినిమా చేస్తున్నాడట.

ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయం ఇంకా బయటకు రాలేదు కాని కళ్యాణ్ రాం నిర్మాణంలో నాని హీరోగా ఓ సినిమా వస్తుందని మాత్రం ఫిల్మ్ నగర్ ఎక్స్ క్లూజివ్ న్యూస్. మరి ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యిందో కాని ఈ కాంబో లో వస్తున్న సినిమా మాత్రం రచ్చ చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు సిని అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news