Gossipsఅందుకే ఎన్టీఆర్ ముఖం చాటేస్తున్నాడా..?

అందుకే ఎన్టీఆర్ ముఖం చాటేస్తున్నాడా..?

ఏంటి ఎక్కడా తారక్ హడావుడి కనిపించడంలేదు..? ఇంత సైలెన్స్ అయిపోవడానికి కారణం ఏంటి ..? సర్వత్రా అభిమానుల్లోనూ.. టాలీవుడ్ లోనూ ఒకటే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే తారక్ సైలెన్స్ అవ్వడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది .. అది ఏమై ఉంటుంది..? అని ఎవరికీ నచ్చినట్టు వారు ఊహించేసుకుంటున్నారు. వాస్తవానికి తారక్ సినిమా రిలీజ్ అయ్యి నెలలు దాటిపోయింది. కొత్త సంవత్సరం లో కానీ త్రివిక్రమ్ తో తారక్ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపించడంలేదు. అందుకే ఈ మధ్యనే విదేశాలకు కూడా ఫ్యామిలీ ట్రిప్ కూడా వేసేశాడు ఈ యంగ్ నందమూరి హీరో.

విష్యం ఏంటంటే… తారక్ మళ్లీ మేకోవర్ కు ట్రై చేస్తున్నాడట. మొదటిసారిగా త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న సినిమా కావడం, అందులోనూ … కుటుంబ కథ చిత్రం కావడంతో అభిమానులకు కొత్త అనుభూతి కల్పించేందుకు ఎన్టీఆర్ సిద్దము అయిపోయాడు. దీనికోసం జిమ్ లో తెగ కసరత్తులు చేస్తూ ..బాడీ షేప్ లు మార్చుకునే పనిలో పడ్డాడు.

గతంలో కొన్ని మార్లు బాగానే సన్నబడినా, ఎన్టీఆర్ మళ్లీ ఒళ్లు చేశాడు. తాజాగా … జై లవ కుశలో మూడు పాత్రల కోసం కూడా బాగా కష్టపడ్డాడు.అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు తెగ కష్టపడిపోతున్నాడు ఈ హీరో. వచ్చే సినిమాలో తన లుక్ సరికొత్తగా మార్చుకుని అభిమానులకు కొత్తగా కనిపించాలని తారక్ ఆలోచిస్తున్నాడు. అందుకే ఎవరికీ కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news