Moviesఅఫీషియల్: యంగ్‌టైగర్ నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ కన్ఫమ్.. లాంచ్ అప్పుడే!

అఫీషియల్: యంగ్‌టైగర్ నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ కన్ఫమ్.. లాంచ్ అప్పుడే!

Finally young tiger NTR has choosen director for his 27th project. According to the latest updates, this movie going to launch on 10 December and produced by Kalyan Ram on NTR Arts banner. In this film NTR will play dual role.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా? అనే మూడు నెలల నిరీక్షణకు చివరికి శుభం కార్డ్ పడింది. ఎందుకంటే.. తారక్ తన దర్శకుడిని ఎంపిక చేసుకున్నాడు. కథ డిఫరెంట్‌గా ఉండడం, ‘గ్యారేజ్’ రేంజ్ హిట్ ఇప్పించగలడన్న నమ్మకంతో.. ఆ డైరెక్టర్‌ని తన తదుపరి ప్రాజెక్ట్‌కి ఫైనలైజ్ చేసుకున్నాడు. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. ‘పవర్’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలను తెరకెక్కించిన బాబీ.

ఈమధ్యే బాబీ, తారక్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపించింది. మొదట్లో ఇది రూమరేనని అంతా లైట్ తీసుకున్నారు కానీ.. అది నిజమేనని, వీరి కాంబోలో మూవీ సెట్స్ మీదకి వెళుతోందని అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చేసింది. అంతేకాదు.. ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 10వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తారక్ అన్నయ్య, హీరో కళ్యాణ్ రామ్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే హీరోయిన్, తారాగణం ఎంపిక జరగనుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ని జనవరి నుంచి ప్రారంభించనున్నారు.

నిజానికి.. బాబీ ఇప్పటికే రవితేజతో ఓ సినిమా చేయాల్సింది. అంతా సవ్యంగా జరిగివుంటే.. ఆ చిత్రం సెట్స్ మీద ఉండేది. కానీ.. చివరి నిముషంలో నిర్మాత తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో.. బాబీ నేరుగా ఎన్టీఆర్‌ని సంప్రదించాడు. తొలుత రవితేజ కోసం ప్రిపేర్ చేసిన స్టోరీని వినిపించగా.. దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎలాగైనా ఎన్టీఆర్‌తో చేయాలని పూనుకున్న బాబీ.. రెండు వారాల్లోనే మరో ఫ్రెష్ స్ర్కిప్ట్ రెడీ చేశాడు. అది తనకు నచ్చడంతో.. తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. స్ర్కిప్ట్ ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌లో నటించనున్నాడని తెలుస్తోంది.

ntr-bobby-movie-finalised

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news