Moviesఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే బ్రహ్మాండమైన న్యూస్.. ఇక మొదలైంది!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే బ్రహ్మాండమైన న్యూస్.. ఇక మొదలైంది!

Finally, Kalyan Ram has officially announced NTR 27th movie Muhurtham and Shooting start dates through twitter which is going to be directed by bobby.

మూడు నెలలు మౌనం పాటించిన తర్వాత తన తదుపరి సినిమా బాబీ దర్శకత్వంలో ఉంటుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనౌన్స్ అయితే చేశాడు. కానీ.. అది ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గానే ఉంచాడు. గత నెల నుంచి అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చాడు కానీ.. కచ్ఛితమైన క్లారిటీ ఇవ్వలేదు. అటు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. దీంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దేనికోసమైతే వీళ్లంతా వేచిచూస్తూ వచ్చారో ఆ వార్త అఫీషియల్‌గా వెల్లడైంది.

ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరుపుకుంటుందని.. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని కళ్యాణ్ రామ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. దీంతో.. తారక్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎందుకంటే.. ‘గ్యారేజ్’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తారక్ చేస్తున్న తదుపరి చిత్రం కాబట్టి దీనిపై అనూహ్య అంచనాలు నెలకొన్నాయి. పైగా.. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్నాడని తెలిసి, ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు తారక్‌లను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు. సాధారణంగా సింగిల్ క్యారెక్టర్‌లోనే అద్భుత అభినయం కనబరిచి ఆడియెన్స్‌ని కట్టిపడేస్తాడు తారక్. అలాంటిది.. మూడు పాత్రల్లో కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? ప్రతిఒక్కరూ పూనకాలతో ఊగిపోతారు. అందుకే.. ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక నుంచి తారక్ టైమ్ స్టార్ట్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news