రట్టయిన భారీ సెక్స్ రాకెట్.. ఆ ఎన్నారై లేడీనే కీ-రోల్.. ఒక్కసారి ప్లాన్ వేస్తే అంతే!

nri woman become part of sex racket and caught redhanded

Hong Kong-born NRI Ravneet Kaur arrested for alleged involvement in sex racket.

రాజస్థాన్‌లో ఓ భారీ సెక్స్ రాకెట్‌ని పోలీసులు రట్టు చేశారు. ఈ బ్రోతల్ కేసులో అడ్డంగా దొరికిపోయిన వారిలో ఓ ఎన్నారై లేడీ ప్రధాన సూత్రధారిగా షాకింగ్ విషయం. ఉన్నత విద్యని అభ్యసించిన ఆ అమ్మడు.. డబ్బులు సంపాదించే మార్గాన్ని వెతికే క్రమంలో ఈ వ్యభిచారం కూపంలోకి అడుగుపెట్టింది. తనకున్న తెలివిని బాగా వినియోగించి.. ఎంతోమందిని మోసం చేసి, భారీ డబ్బులు వెనకేసుకుంది. చివరికి పోలీసులకు చిక్కి, జైల్లో ఊచలు లెక్కిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవనీత్ కౌర్ అనే 26 ఏళ్ల యువతి హాంకాంగ్‌లో పుట్టి పెరిగింది. 2008లో పంజాబ్‌లోని సొంతూరికి వచ్చిన ఆమె.. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్‌లో ఓ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. 2009లో గుర్గాన్ వచ్చి తన స్నేహితురాలి కుటుంబంతో కలిసి నివాసం ఉంది. 2012లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీబీఏ చదువుకుంది. ఆ కోర్సు పూర్తయ్యాక.. జాబ్ కోసం వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈమె సెక్స్ రాకెట్‌ను శాసించే అక్షిత్ శర్మను కలుసుకుంది. అతడు ఆమె ద్వారా తన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా.. నెలకు రూ.12 వేలు జీతం వచ్చే ఉద్యోగమిచ్చాడు. అక్కడ నుంచి రవనీత్ తన టాలెంట్ ప్రదర్శించడం మొదలుపెట్టింది. వ్యభిచారంలో భారీ డబ్బులు సంపాదించుకోవచ్చని తెలుసుకుని.. ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆమె ప్లాన్‌కి ఫ్లాట్ అయిపోయిన అక్షిత్.. తన ముఠాతో కలిసి దాన్ని ఆచరణలో పెట్టేందుకు రెడీ అయ్యాడు.

ప్లాన్ ప్రకారం.. 2014లో రవనీత్ కౌర్ ఓ బిల్డర్ దగ్గరకు వెళ్లింది. అందచందాలతో అతడ్ని తన వలలో పడేసింది. అంతే.. కాసేపు అతడితో రొమాన్స్ చేసింది. ఇంతలోనే ఆమెతోపాటు వచ్చిన గ్యాంగ్ వారి బెడ్‌రూంలోకి దూరారు. ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే ఆ వీడియోతోపాటు ఫోటోలు బయటపెడతామని భయపెట్టారు. వారి ప్లాన్‌కి లొంగిన ఆ బిల్డర్.. రూ.1.20 కోట్లు సమర్పించుకున్నాడు. ఈ ప్లాన్ వేసినందుకుగాను రవనీత్‌కి రూ.30 లక్షలు దక్కింది. ఈ తరహాలోనే ముఠాతో కలిసి ఆ యువతి ఆరుమందిని బ్లాక్‌మెయిల్ చేసి.. రూ.1 కోటిపైగా సంపాదించింది. ఇంతమొత్తం ఆర్జించిన ఈ భామ.. గతేడాది ఫిబ్రవరిలో రోహిత్‌ని పెళ్లి చేసుకుని సెటిలైంది. కొన్నాళ్లు దాంపత్య జీవితాన్ని కొనసాగించింది కానీ.. తన వృత్తిని వదిలి ఎంతోకాలం ఉండలేకపోయింది.

దాంతో.. ఆ వ్యభిచారం ముఠాతో కలిసి రవనీత్ మరో ప్లాన్ వేసింది. ఓ బిల్డర్‌కి వల వేయాలని పక్కా ప్రణాళిక రచించింది. అంతా ప్లాన్ ప్రకారమే బిల్డర్ దగ్గరికి వెళ్ళారు. అతడ్ని వలలో వేసుకునేందుకు రవనీత్ బెడ్‌రూంలోకి వెళ్ళింది. అందంతో కట్టిపడేసేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెతోపాటు ముఠా సభ్యుల్ని కూడా అడ్డంగా పట్టుకున్నారు. నిజానికి.. వీరికోసం పోలీసులు చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. చివరికి ఈ ప్లాన్ గురించి తెలియడంతో.. పక్కా ప్లాన్ ప్రకారం వారిని అదుపులోకి తీసుకోగలిగారు.

More from my site