Gossipsనితిన్ లై స్టోరీ లీక్డ్...

నితిన్ లై స్టోరీ లీక్డ్…

ఆగష్టు 11 టాలీవుడ్ జనానికి పిచ్చెక్కించబోయే రోజు…ఆ ఒకేసారి 3సినిమాలు విడుదలకాబోతున్నాయి. రానా నేనే రాజు నేనే మంత్రి, బోయపాటి డైరెక్షన్లో జయజానకి నాయక, నితిన్ హీరోగా లై సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ మూడింటిలో లై సినిమా రిజల్ట్ ముందుగా తెలియబోతుంది. మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ ప్రారంభం కాబోతున్నాయి.

రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర కలిసి 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమాని.ఓవర్సీస్ మార్కెట్ పై మంచి పట్టున్న వీరు లై సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ‘సినిమా పారడిసో’ ద్వారా యూఎస్ లో భారీ స్థాయిలో లై సినిమాను విడుదల చేస్తోంది ఈ 14 రీల్స్ బ్యానర్.

నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 125కి పైగా లొకేషన్లను చూసారు.రిలీజ్ అయ్యే టైమ్ కు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. నితిన్ కెరీర్ లో భారీగా విడుదల అవుతున్న ఓవర్సీస్ సినిమా. ఈ సినిమా ప్రీమియర్స్ ను అక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది 14 రీల్స్ సంస్థ. ఏకంగా 107 లొకేషన్లలో ప్రీమియర్స్ వేయబోతున్నారు. మరికొన్ని గంటల్లో యూఎస్ లోని అన్ని ప్రధాన నగరాల్లో ‘లై’ సినిమా ప్రీమియర్స్ మొదలవబోతున్నాయి. ఆ వెంటనే సినిమా టాక్ బయటకొస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news