Moviesనితిన్ 'లై' వారం రోజుల కలక్షన్స్..!

నితిన్ ‘లై’ వారం రోజుల కలక్షన్స్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా లై. ఆగష్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. స్టైలిష్ మేకింగ్ తో యూఎస్ అందాలను చూపించినా కథలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక లాస్ట్ ఫ్రై డే వచ్చిన మూడు సినిమాల్లో లై నిరాశ పరచింది.14 రీల్స్ నిర్మించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా పరిచయమైంది. యాక్షన్ హీరో అర్జున్ ఈ సినిమాలో విలన్ గా నటించడం జరిగింది.

ఇక ఈ సినిమా ఏరియాలా వారిగా వారం రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం 2.90 కోట్లు,
సీడెడ్ 1.80 కోట్లు,
వైజాగ్ 1.05 కోట్లు,
గుంటూర్ 0.58 కోట్లు,
కృష్ణ 0.55 కోట్లు,
ఈస్ట్ 0.64 కోట్లు,
వెస్ట్ 0.34 కోట్లు,
నెల్లూరు 0.25 కోట్లు.
మొత్తంగా ఏపి, తెలంగాణా రాష్టాల్లో 7.39 కోట్ల వసూళ్లను రాబట్టింది నితిన్ లై మూవీ.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 065 కోట్లు,
ఓవర్సీస్ లో 0.70 కోట్లు వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా లై మూవీ 8.74 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news