Moviesచైతు రీమేక్ లో కన్నడ కుర్రాడు..!

చైతు రీమేక్ లో కన్నడ కుర్రాడు..!

నాగ చైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటించిన ఈ సినిమా చైతు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నాడు మాజి సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్.
మొదటి సినిమా జాగ్వార్ 75 కోట్లు పెట్టి స్టార్ ఇమేజ్ ప్రయత్నిచి విఫలమవడంతో ఈసారి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఎంచుకున్నాడు. ఈ ఇయర్ రిలీజ్ అయిన చైతు రారండోయ్ వేడుక చూద్దాం సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నాడు. తెలుగు సినిమాలకు కన్నడలో మంచి గిరాకి ఉంటుంది. ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో అక్కడ రీమేక్ అయ్యాయి.
మరి నిఖిల్ గౌడ్ చేస్తున్న ఈ రెండో ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. సినిమాలో ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. మరి అక్కడ ఎవర్ని తీసుకుంటారో చూడాలి. సినిమాకు అక్కడ సీతారామ కళ్యాణం అని టైటిల్ పెట్టారట.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news