Newsఆ పుస్తకం ఖరీదు అక్షరాల 21 కోట్లు..!

ఆ పుస్తకం ఖరీదు అక్షరాల 21 కోట్లు..!

A book named principia mathematica book has been sold for 21 crores which is written by ISAAC Newton who is to be known the first man to take steps towards Science.

సాధారణంగా ఒక పుస్తకం ఖరీదు ఎంత ఉంటుంది..? అంచనా వేసుకుంటే.. 50 రూపాయల నుంచి ఒక లక్ష వరకు ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండదు. కానీ.. ఒక్క పుస్తకం మాత్రం ఏకంగా రూ.21 కోట్లకు అమ్ముడుపోయింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అందులో అంత ప్రత్యేక ఏముంది? అని అనుకుంటున్నారా! అయితే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

సైన్స్ పరంగా ప్రపంచంలో మొదటిగా ఆలోచించిన వ్యక్తి ఎవరంటే.. న్యూటన్ అని చాలామంది నమ్ముతారు. బాలమేధావిగా చిన్నప్పుడే గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆరోజుల్లో టెక్నాలజీ లేకుండానే ‘న్యూటన్ నియమాల్ని’ ఆవిష్కరించారు. అలాంటి మేధావి ఫిజిక్స్ సూత్రాలపై ‘ప్రిన్సిపియా మాథమెటికా’ అనే పుస్తకం రాశారు. ఇది ఆషామాషీ బుక్ కాదు. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం అచ్చైన ఈ పుస్తకంలో ఫిజిక్స్ మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. ఈ బుక్ సరిగ్గా చదివితే.. మరిన్ని పరిశోధనలకు నాంది పలకొచ్చు. అంతెందుకు.. సైన్స్ పరంగా మానవుడు వేసిన అతిపెద్ద ముందడుగు ఈ పుస్తకమేనని ఐన్ స్జీన్ చెప్పారంటే దీని ప్రత్యేకతేంటో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి పుస్తకం ఇప్పుడు వేలానికి వచ్చింది. ఎప్పుడో రాసింది కావడంతో.. అది అంత తేలిగ్గా లభించడం లేదు. అందుకే.. దీన్ని వేలానికి వేయగా, న్యూటన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. వాళ్లలో ఒకరు ఏకంగా రూ.21 కోట్లు వేలం పాడి.. ఈ పుస్తకాన్ని దక్కించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news