Moviesపైసా వసూల్ ప్రమోషన్ లో కొత్త ట్రెండ్ షురూ..!

పైసా వసూల్ ప్రమోషన్ లో కొత్త ట్రెండ్ షురూ..!

నందమూరి బాలకృష్ణ హీరోగా 101వ సినిమా రాబోతున్న సినిమా పైసా వసూల్. పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 రిలీజ్ అని అన్నారు. కాని ఇప్పుడు ఆ సినిమా అనుకున్న డేట్ కన్నా ముందే తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారట. డ్రగ్స్ కేసులో విచారణ పూర్తి చేసుకున్న పూరి ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

పైసా వసూల్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్.బి.కె 101 ఫీవర్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఓ వీడియో రిలీజ్ చేశారు. దానిలో 1974లో బాలయ్య సిని రంగ ప్రవేశం చేసిన నాటి నుండి శాతకర్ణి వరకు సినిమాల ప్రస్థానం చూపించారు. అంతేకాదు ఈ నెల 28న స్టంపర్ 101 రిలీజ్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు.

అయితే ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే స్టంపర్ అంటే ఏంటనే అయితే టీజర్ కే స్టంపర్ అని కొత్త పేరు పెట్టినట్టు తెలుస్తుంది. బాలయ్య డాన్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ స్టంపర్ 101 నందమూరి ఫ్యాన్స్ ను ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news