Movies" నీది నాది ఒకే కథ " ప్రీ - రివ్యూ

” నీది నాది ఒకే కథ ” ప్రీ – రివ్యూ

మొన్నటిదాకా హీరో పక్కన సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ ను అలరించిన శ్రీ విష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మెయిన్ లీడ్ గా కూడా శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత మనవాడికి సోలో ఇమేజ్ బాగా పెరిగింది. రీసెంట్ గా మెంటల్ మదిలో సినిమాతో అలరించిన శ్రీ విష్ణు ప్రస్తుతం నీది నాది ఒకే కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్నారు. అరన్ మీడియా వర్క్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా సాట్న టైటస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఓ చదువు రాని కుర్రాడు లైఫ్ లో పడే స్ట్రగుల్స్ గురించి చూపించారు. తండ్రి ఓ ఉపాధ్యాయుడు అయ్యుండి కొడుకుని చదువులో రాణించపచేయనీయలేడు.

వారిద్దరి మధ్య సీన్స్ హృదాయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఇక సినిమా ప్రతి చదువు రాని విద్యార్ధికి టచ్ అయ్యేలా.. చదువు భారంగా భావించే వారి అభిప్రాయాలకు దగ్గరగా ఉంటుంది. సినిమా అంతా రొటీన్ పంథాలో కాకుండా కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు. సాధ్యమైనంత వరకు సినిమా అంతా సహజత్వంగా ఉంటుందని తెలుస్తుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో ఎమోషనల్ సీన్స్, కథ కథనాలు సినిమాకు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, రాజ్ తోటా, ప్రవేజ్ సినిమాటోగ్రఫీ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని చెప్పొచ్చు.

సినిమా అంతా కామెడీతో పాటుగా మంచి ఎమోషనల్ మూవీగా నడుస్తుందని చెప్పొచ్చు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. టీజర్ ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పరచగా పోటీగా మరో రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండిటిపై ఈ సినిమా నెగ్గుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news