Gossipsఅందుకు నయనతార డబ్బులు తీసుకోలేదా ..?

అందుకు నయనతార డబ్బులు తీసుకోలేదా ..?

తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకున్నముద్దుగుమ్మ నయనతార. ఆమెను చూసి అందరూ తారా .. తళుకు తారా తనివితీరా అంటూ పాటలు పాడుకుంటారు. ఈమె పర్సనల్ లైఫ్ లో ఎన్నో అలజడులు జరిగినా నిలదొక్కుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పుడు ఉన్న హీరోయిన్ లలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు.

ప్ర‌స్తుతం మూడు కోట్ల‌కి పైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఓ సినిమా కోసం అసలు పారితోషకమే తీసుకోకుండా నటించింది అట. ఈ వార్త ప్రస్తుతం పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ వార్త ఇప్పుడు బయటకి వచ్చినా.. కొత్త సినిమాకి సంబంధించిన విషయం కాదులెండి. మరికొన్ని వివరాలు పరిశీలిస్తే… నాలుగున్న‌రేళ్ళ క్రితం.. న‌య‌న‌తార ఓ త‌మిళ చిత్రంలో ప్ర‌త్యేక గీతం చేసింది. ఆ చిత్ర‌మే ‘ఎదిర్ నిశ్చ‌ల్‌’. ఇప్పుడు త‌మిళ‌నాట ప్ర‌ముఖ యువ క‌థానాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న శివ‌కార్తీకేయ‌న్ ఇందులో హీరో. ప్రియా ఆనంద్ హీరోయిన్‌.

ప్ర‌ముఖ న‌టుడు ధ‌నుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం న‌య‌న‌తార ఒక్క పైసా కూడా తీసుకోలేద‌ని శివ‌కార్తీకేయ‌న్ చెప్పుకొచ్చాడు. శివ‌కార్తీకేయ‌న్‌, న‌య‌న‌తార జంట‌గా న‌టిస్తున్న త‌మిళ చిత్రం ‘వేలైక్కార‌న్’ ఆడియో సోమ‌వారం విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా న‌య‌న‌తార గురించి మాట్లాడుతూ శివ ఈ విష‌యాన్నిబయటపెడ్తాడు. ఏమైనా నయన్ ది పెద్దమనసు అని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news