Newsఅతనితో డేటింగ్.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నయనతార.. ఇదిగో సాక్ష్యం

అతనితో డేటింగ్.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నయనతార.. ఇదిగో సాక్ష్యం

Finally, Nayanatara caught redhanded being in relationship with director Vignesh Shivan with whom she is dating from long time.

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నయనతార.. ఎప్పుడు ఏదో ఓ ఎఫైర్‌తో వార్తల్లోకెక్కుతుంటుంది. గతంలో శింభు, ప్రభుదేవాలతో పీకల్లోతు ప్రేమాయణం నడిపిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ చెప్పేసి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకి ఓ యంగ్ దర్శకుడు పరిచయమయ్యాడు. అతడే విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా సమయంలో కలుసుకున్న వీళ్ళిద్దరూ.. అప్పటినుంచి రహస్యంగా డేటింగ్ చేస్తూ వస్తున్నారు.

ఈ వార్తల్ని నిజం చేస్తూ చాలా సందర్భాల్లో ఇద్దరూ ఏకాంతంగా కెమెరాకి చిక్కారు. అంతేకాదు.. ఏ ఈవెంట్‌కైనా జంటగానే విచ్చేశారు. ఇప్పుడైతే హద్దులే దాటేశారు. ఏకంగా సహజీవనం చేస్తున్నారు. అవును.. గతకొంతకాలం నుంచి ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. చెన్నైలోని విలాసవంతమైన భవనంలో విఘ్నేష్‌తో కలిసి నయనతార ఉంటోంది. ఈ వార్తల్ని నిజం చేస్తూ తాజాగా మరోసారి జంటగా కెమెరాకంట పడ్డారు. జయలలిత పార్థివదేహాన్ని దర్శించడానికి వీళ్ళద్దరూ జంటగానే వచ్చారు. దీంతో.. వీళ్ళు సహజీవనం చేస్తున్న విషయం నిజమేనని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనిపై వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

nayana-with-vignesh

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news