Movies‘నేను లోకల్’తో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసిన నాని

‘నేను లోకల్’తో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసిన నాని

Finally, Natural star Nani has achieved a rare feat in this generation heroes that is double hattrick hits with Nenu Local.

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. సక్సెస్ బాటలో ఉన్నప్పుడు కాస్త ఆవేశంగా ఓ తప్పటడుగు వేస్తాడు. దాని కారణంగా కెరీర్‌లో ఎప్పుడూ చూడని భారీ డిజాస్టర్స్‌ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటి జనరేషన్ హీరోలే కాదు.. ఆనాటి సీనియర్ స్టార్స్ కూడా అలాంటి పరిణామాలు ఎదుర్కొన్న వాళ్లే. కానీ.. నేచురల్ స్టార్ నాని మాత్రం ఎవరూ సాధించని ఓ అరుదైన ఫీట్‌ని అందుకున్నాడు.

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చేసి హిట్ అందుకున్నాడు నాని. అప్పుడు మనోడికి కాస్త బల్బ్ వెలిగినట్లు ఉంది. విజయం సాధించాలంటే, ఆడియెన్స్‌ని మెప్పించే స్ర్కిప్టులు ఎంచుకోవాలని గ్రహించి, ఆ తరహా కథలే ఎంచుకున్నాడు. ఫలితంగా అతడు వరుసగా ఐదు విజయాలు అందుకున్నాడు. గత రెండేళ్లలో ఈ ట్రాక్ రికార్డ్ సాధించిన నాని.. తాజాగా ‘నేను లోకల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈరోజు (03-02-2017) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా హిట్ టాక్ సంపాదించుకుంది. చూసిన ప్రతిఒక్కరూ ఈ చిత్రం భలే ఉందని, పూర్తిగా ఎంటర్‌టైన్ చేసిందని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. విమర్శకులు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా అన్నిచోట్ల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడంతో.. దీన్ని హిట్‌గా పరిగణిస్తున్నారు. దీంతో.. నాని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించాడు.

ఇప్పటి జనరేషన్‌లో ఏ ఒక్క హీరో ఇలా కంటిన్యూగా 6 హిట్స్ అందుకున్న దాఖలాలు లేవు. బహుశా అప్పటి సీనియర్ హీరోలు కూడా ఇలా విజయాలు అందుకున్నారో లేదో తెలీదు కానీ.. ప్రస్తుత హీరోల్లో మాత్రం నానినే ఈ ఫీట్ అందుకున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమలో చిరకాలంగా నిలిచిపోయే హిస్టారికల్ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. నానిలాగే ఇతర హీరోలు కూడా ఇలాగే వరుస విజయాలు అందుకోవాలని కోరుకుందాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news