Newsపోస్టర్ తో సంచలనం సృష్టించిన 'బాలకృష్ణుడు'..

పోస్టర్ తో సంచలనం సృష్టించిన ‘బాలకృష్ణుడు’..

నారా వారి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన కుర్రాడు నారా రోహిత్. తెలుగు పరిశ్రమలో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త ప్రయోగాలు చేసే హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ప్రస్తుతం నారా రోహిత్ పవన్ మల్లెల డైరక్షన్ లో చేస్తున్న సినిమా బాలకృష్ణుడు. సినిమా టైటిల్ లానే సినిమాలో రోహిత్ లుక్ కూడా సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇన్నాళ్లు బొద్దుగా లావుగా కనిపించిన నారా రోహిత్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడట.

అంతేకాదు సినిమా టైటిల్ బాలకృష్ణుడు అని పెట్టి బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు రోహిత్. రాజకీయ పలుకుబడి, నందమూరి అభిమానుల అండదడలున్నా కమర్షియల్ హిట్ కన్నా కాన్సెప్ట్ మూవీలే ముఖ్యం అనుకుంటూ కొత్త వారికి అవకాశం ఇస్తూ రోహిత్ చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీకే ఓ కొత్త ఉత్సాహాన్ని తెస్తున్నాయి.

రీసెంట్ గా శమంతకమణితో ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ చేసిన రోహిత్ త్వరలో కథలో రాజకుమారి సినిమాతో రానున్నాడు. ఇక ఇదే కాకుండా ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన బాలకృష్ణుడు కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రెజినా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నారా రోహిత్ కెరియర్ లో ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news