Gossipsప్రాణ స్నేహితుల మధ్య వివాదానికి కారణం అదే..!

ప్రాణ స్నేహితుల మధ్య వివాదానికి కారణం అదే..!

సినిమా ఎలాంటి వారినైనా సరే కలుపుతుంది.. అదే సినిమా ఎలాంటి వారినైనా విడదీస్తుంది. ఆ కోవలోనే దశాబ్ధ కాలంగా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్న ఇద్దరు స్నేహితులు తమ సినిమాల వల్ల ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే నారా రోహిత్, శ్రీవిష్ణుల ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే. శ్రీవిష్ణు ప్రస్తుతం ఈ క్రేజ్ తెచ్చుకున్నాడు అంటే అది రోహిత్ వల్లే అని చెప్పొచ్చు.

తన పక్కన అవకాశాలిస్తూ తానే నిర్మాతగా అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో శ్రీవిష్ణుకి సూపర్ హిట్ ఇచ్చాడు రోహిత్. అలాంటి నారా రోహిత్ కు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు శ్రీవిష్ణు. రోహిత్ బాలకృష్ణుడు సినిమా ఈ నెల 24న ఫిక్స్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అని తెలిసి కూడా శ్రీవిష్ణు తన మెంటల్ మదిలో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

అయితే ఇందులో శ్రీవిష్ణు ప్రమేయం ఏమి లేదని తెలుస్తుంది. మెంటల్ మదిలో సినిమాను సురేష్ బాబు కొన్నాడు. అందుకే 24న రిలీజ్ కన్ ఫాం చేశారు. ఓ పక్క నారా రోహిత్ బాలకృష్ణుడు అదే డేట్ న వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news