Gossipsమహేష్ బాటలోనే నేను అంటున్న కుర్ర హీరో !

మహేష్ బాటలోనే నేను అంటున్న కుర్ర హీరో !

మిల్క్ బాయ్ మహేష్ బాటలోనే నేను నడుస్తానుంటున్నాడు ఒక కుర్ర హీరో. మొన్నటి వరకు సిక్స్ ప్యాక్ లతో తెగ హడావుడి చేసేసిన హీరోలందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు నారా వారి హీరో రోహిత్ మాత్రం తాజా సినిమాలో సిక్స్ ప్యాక్ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గిన ఈ హీరో రాబోతున్న సినిమాలో మాత్రం ఆ బాడీని ప్రదర్శించడంట . దీనికి కారణం మహేష్ అంట.

‘బాలృష్ణుడు’ సినిమా కోసం రోహిత్ బాగా బరువు తగ్గి.. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రోహిత్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తాను గత ఏడాది ‘జ్యో అచ్యుతానంద’ చేసే సమయానికి.. ఇప్పటికి ఏకంగా 21 కిలోలు తగ్గినట్లు రోహిత్ వెల్లడించాడు. ఇలా బరువు తగ్గే క్రమంలో సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాననన్నాడు.

మొదట ‘బాలకృష్ణుడు’ దర్శకుడు పవన్ మల్లెల బరువు తగ్గే విషయంలో తన వెంట పడి ఒత్తిడి చేశాడని.. ఆ తర్వాత తనకే బాగా అలవాటైపోయి అతను కోరుకున్న దాని కంటే ఎక్కువ బరువు తగ్గానని రోహిత్ వెల్లడించాడు. ఐతే సిక్స్ ప్యాక్ ట్రై చేసినప్పటికీ దాన్ని తెరమీద చూపించాలన్న కోరికేమీ లేదని.. ‘బాలకృష్ణుడు’లో కూడా అలా ఏమీ చూపించలేదని రోహిత్ స్పష్టం చేశాడు.

సునీల్ లాంటి వాళ్లు సిక్స్ ప్యాక్ ఉంది కదా అని ప్రతి సినిమాలోనూ అవసరం తెగ ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేస్తే.. రోహిత్ మాత్రం కష్టపడి ట్రై చేసిన సిక్స్ ప్యాక్‌ను తెరమీద చూపించాలనుకోకపోవడం ఆశ్చర్యమే. ఇంతకుముందు మహేష్ సైతం ‘1 నేనొక్కడినే’ టైంలో ఇలాంటి నిగ్రహమే పాటించాడు. అతను కూడా దాదాపుగా సిక్స్ ప్యాక్ చేసినప్పటికీ తెర మీద బేర్ బాడీ చూపించడానికి ఇష్టపడలేదు.ఇప్పుడు అదే స్పూర్తితో రోహిత్ కూడా మహేష్ ని ఫాలో అయిపోతున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news