Gossipsవెంకీ సినిమాలో విలన్ గా ఆ నందమూరి హీరో

వెంకీ సినిమాలో విలన్ గా ఆ నందమూరి హీరో

గురు సినిమాతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్..తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో విజయం అందుకున్న డైరెక్టర్ తేజ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటి నటుల ఎంపిక జరుగుతుంది. ఈ సినిమాలో కీలకమైన విలన్ పాత్ర నారా రోహిత్ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ , ఈ మధ్యనే వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. కొత్తగా తేజ చెప్పిన ఈ కథ నచ్చడం తో వెంటనే విలన్ రోల్ చేయడానికి ఓకే చెప్పాడట.

గతం లో తేజ ‘జయం’ సినిమాలో హీరో గోపీచంద్‌ ను విలన్ గా చూపించి అతడి కెరియర్ లో ఓ మైలురాయి గా నిలిచిపోయేలా చేసాడు. ఇప్పుడు నారా రోహిత్ కు సైతం ఈ రోల్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చెపుతున్నాడు. ఇటీవల కాస్త బరువు తగ్గిన రోహిత్‌, సిక్స్‌ ప్యాక్‌ లో కూడా ప్రేక్షకులని అలరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. వెంకటేష్ కి విలన్ పాత్రలో నారా రోహిత్ ఏ మేరకు మెప్పిస్తారో త్వరలోనే తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news